‘ఆర్‌ఎక్స్ 100’తో బోల్డ్‌బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్నారు పంజాబీ భామ పాయల్ రాజ్‌పుత్. తాజాగా ‘ఆర్‌డీఎక్స్ లవ్’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. భాను శంకర్ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా శనివారం పాయల్ రాజ్‌పుత్ సినిమా గురించి చెప్పుకొచ్చిన ముచ్చట్లివి..‘ఆర్‌ఎక్స్100’తో మంచి గుర్తింపు వచ్చింది. దాదాపు ఏడాది తర్వాత వచ్చిన అవకాశమిది. నా పాత్ర కాస్త బోల్డ్‌గా ఉన్నప్పటికీ మహిళా ప్రాధాన్యం ఉన్న కథ కావడంతో అంగీకరించా. పాపికొండలు గ్రామంలో సాగే కథ ఇది. అలివేలు అనే సామాజిక కార్యకర్తగా ఊరిలో సమస్యలపై పోరాడే పాత్ర ఇది. నా పాత్ర సహజంగా ఉంటుంది. ట్రైలర్ చూసి ఇదేదో హాట్ సినిమా అనుకుంటున్నారు. ఉన్న ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాలు మొత్తం ట్రైలర్‌లోనే చూపించేశాం. సినిమాలో చూపించడానికి హాట్ సీన్లు ఏమీలేవు. ఈ సినిమా కోసం కనీస సౌకర్యాలు లేని గ్రామంలో 45 రోజులకు పైగా కష్టపడి పనిచేశా. కానీ ఆ కష్టాన్ని కూడా ఆస్వాదించా. భాను శంకర్ క్లారిటీ ఉన్న దర్శకుడు. ఆయన పనితీరు బావుంది. తప్పకుండా నా ఖాతాలో మరో మంచి సినిమా అవుతుంది. ప్రస్తుతం ‘వెంకీ మామా’, ‘డిస్కోరాజా’తోపాటు మరో సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నా. బోల్డ్ క్యారెక్టర్ అయినా మామూలు పాత్ర అయినా మనసుకి నచ్చితేనే చేస్తా. మాతృభాష పంజాబీలో కూడా చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ నా దృష్టి అంతా తెలుగు సినిమాపైనే ఉంది. పాయల్ ‘సౌత్ సినిమా రుచి చూసింది. ఇక ఇక్కడికి రాదు’ అని మా వాళ్లంతా అంటున్నారు’’ అని అన్నారు.
తెలుగు రుచి మరిగింది
Related tags :