పట్టణాల్లో చాలామంది ఎండకు బయటకు రానేరారు. శరీరానికి ఎండ తగలనివ్వరు. అలాంటి వారిలో విటమిన్-డి లోపిస్తుంది. విటమిన్ డి లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
-విటమిన్ డి అనేది కొవ్వును కరిగిస్తుంది. ఇది కాలేయంలో నిల్వ ఉంటుంది. విటమిన్ డి లోపించకుండా ఉండాలంటే.. కనీసం రోజుకు 30 నిమిషాలు ఎండకు ఉండాలి. ఇలా చేస్తే శరీరానికి కావాల్సినంత విటమిన్ డి అందుతుంది.
-గుడ్డు పసుపు సొనలో విటమిన్ డి ఉంటుంది. కొందరు ఎగ్‌వైట్ మాత్రమే తీసుకుంటారు. అలా కాకుండా పసుపు సొనను కూడా తీసుకోవడం మంచిది. నట్స్, ఆయిల్ సీడ్స్‌లో కూడా విటమిన్ డి లభిస్తుంది. వీటిని డైలీ డైట్‌లో తీసుకోవడం మంచిది.
-వారానికి కనీసం రెండుసార్లు సాల్మన్, సాైర్డెన్, హెర్రింగ్ వంటి చేపల్ని తింటే మంచిది. వైట్ ఫ్యాటీ ఫిష్ తీసుకోవడం వల్ల కూడా విటమిన్ డి శరీరానికి కావాల్సినంత అందుతుంది.
-విటమిన్ డి ఉన్న సెరెల్ బ్రేక్‌ఫాస్ట్‌లు, పాలు, పెరుగు, ఆయిల్స్ మార్కెట్లో ప్రత్యేకంగా లభిస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవచ్చు. పుట్టగొడుగుల్లో కూడా విటమిన్ డి ఉంటుంది. వీటిని కొంత సమయం ఎండబెట్టడం వల్ల విటమిన్ డి పెరుగుతుంది. పుట్టగొడుగుల్ని ఇతర కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు.
ప్లీజ్….ఎండలో తిరగండి
Related tags :