తెలంగాణా ఎన్నారై ఫోరం(TeNF) లండన్ ఆధ్వర్యంలో యూరప్‌లోనే అతిపెద్ద బతుకమ్మ దసరా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3000 మందికి పైగా ప్రవాసులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నారపరాజు రామచందరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతదేశం నుండి తీసుకువచ్చిన జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజతో ఈ వేడుక ప్రారంభమయింది. ఎమ్మెల్సీ రామచందరరావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించాలని మన మూలాలు తెలిపే కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్నారై సంఘాలకు అభినందనలు తెలిపారు. ప్రకృతిని పూజించే పండుగ చేసుకోవడం తెలంగాణ సంస్కృతికి చిహ్నం అని అన్నారు.భారత రాయబారి కార్యాలయం ఉన్నతాధికారి మనమీత్ నరాంగ్ మాట్లాడుతూ సౌత్ ఇండియా అతిపెద్ద సంస్కృతి కార్యక్రమం మొదటిసారిగా ఇంత పెద్దగా చూస్తున్నానని అన్నారు. లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాలు కాపాడలిసిన బాధ్యత ఎన్నారైలపైన ఉందని అన్నారు. TeNF అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ అంతటి మాట్లాడుతూ యూరోప్ లోనే అతి పెద్ద బతుకమ్మ నిర్వహణ బాధ్యత కు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. TeNF వ్యవస్థాపకుడు గంపా వేణుగోపాల్‌కు అభినందనలు తెలిపారు. ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్, రంగు వెంకట్, కార్యదర్శి పిట్ల భాస్కర్, అడ్వైసరి సభ్యులు డా.శ్రీనివాస్, మహేష్ జమ్ముల, వెంకట్ స్వామ, బాలకృష్ణరెడ్డి, మహేష్ చాట్ల, శేషు అల్లా, వర్మా, స్వామి ఆశా, అశోక్ మేడిశెట్టి, సాయి మార్గ్, వాసిరెడ్డి సతీష్, రాజు కొయ్యడ, నర్సింహారెడ్డి నల్ల, మహిళా విభాగం మీనా అంతటి ,వాణి అనసూరి ,శౌరి గౌడ్ ,సాయి లక్ష్మి, మంజుల, ,జయశ్రీ , శ్రీవాణి మార్గ్ , సవిత జమ్మల ,దివ్యా,అమృత ,శిరీషా ఆశ , ప్రియాంక, రోహిణి తదితరులు వేడుకలో పాల్గొన్నారు.
TeNF ఆధ్వర్యంలో లండన్‌లో దసరా బతుకమ్మ వేడుకలు
Related tags :