అమెజాన్ ‘గ్రేట్ ఇండియా సేల్’, ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్‌బిలియన్ డేస్ సేల్’ ఆఫర్లు వినియోగించుకోలేకపోయిన వారికి శుభవార్త. ఈ రెండు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు మరో ఆఫర్ల పండగకు సిద్ధమయ్యాయి. దీపావళిని పురస్కరించుకుని అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ సేల్’తో మరోసారి సిద్ధమవుతుండగా.. ‘బిగ్ దివాళీ సేల్’ పేరుతో ఫ్లిప్‌కార్ట్ ముందుకొస్తోంది. ఇంతకీ ఎప్పట్నుంచి ఈ సేల్? దేనిపై ఏయే ఆఫర్లు ఉండనున్నాయి?
స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్, కెమెరాలు, టీవీ, ఇతర గ్యాడ్జెట్లపై ఆఫర్లతో అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ సేల్’తో మరోసారి ముందుకొస్తోంది. అక్టోబర్ 13 నుంచి 17 వరకు ఈ సేల్ నడుస్తుంది. ప్రైమ్ సబ్స్క్రైబర్లు అక్టోబర్ 12 మధ్యాహ్నం నుంచే ఈ ఆఫర్లు పొందొచ్చు. ఆఫర్ల సమయంలో ఐసీఐసీఐ క్రెడిట్/డెబిట్ కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. స్మార్ట్ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్‌తో పాటు స్క్రీన్ రీప్లేస్మెంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఈ సేల్‌లో అమెజాన్ అందిస్తోంది. ముఖ్యంగా యాపిల్, షావోమి, వన్‌ప్లస్, శాంసంగ్, వివో, ఆనర్ వంటి బ్రాండ్ల ఫోన్లపై ఆఫర్లు లభించనున్నాయి. వన్‌ప్లస్ 7T ప్రో ఫోన్నుతొలిసారిగా సేల్కు తీసుకురానున్నారు. కేవలం మొబైల్ ఫోన్లే కాక టీవీలు, ఇతర గ్యాడ్జెట్లపైనా లభించనున్నాయి. ఏ ఫోన్‌పై ఎంతెంత డిస్కౌంట్ అనే వివరాలు త్వరలో తెలుస్తాయి.
‘బిగ్‌బిలియన్ డేస్’ తరహాలో ప్లిప్‌కార్ట్ మరోసారి ‘బిగ్ దివాళీ సేల్’కు సిద్ధమైంది. అక్టోబర్ 12 నుంచి 16 వరకు ఈ సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు అక్టోబర్ 11 రాత్రి 8 గంటల నుంచి ఆఫర్లను పొందొచ్చు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు యూజర్లు 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో పాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, డిస్కౌంట్‌తో కూడిన మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్లు, బైబ్యాక్ గ్యారెంటీ ప్లాన్లు ఈ సేల్‌లో లభించనున్నాయి. ప్రస్తుతం రెడ్మీ నోట్ 7 ప్రో, రెడ్మీ 7s, రియల్మీ 5, వివో Z1 ప్రో, రియల్మీ c2 మొబైల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ టీజ్ చేస్తోంది. రానున్న రోజుల్లో పూర్తి ఆఫర్లను ప్రకటించనుంది. కేవలం మొబైల్స్‌పైనే కాక టీవీలు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, స్మార్ట్వాచీలపైనా డిస్కౌంట్లు లభించనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం..? మొన్నటి ఆఫర్లలో వస్తువులు కొనుగోలు చేయలేకపోయిన వారు త్వరలో రాబోయే ఈ రెండు సేల్స్‌కు సిద్ధంకండి..!!