* ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సంస్థలు నిర్వహణ ఖర్చులు తగ్గించుకునే దిశగా చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా ఉద్యోగుల సంఖ్యలో కోత విధిస్తున్నాయి. తాజాగా ఐరోపాలో అతిపెద్ద బ్యాంకింగ్ సర్వీసుల దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ సైతం త్వరలో ఉద్యోగులకు భారీ షాక్ ఇవ్వనుందని సమాచారం. దాదాపు 10వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు యోచిస్తున్నట్లు ప్రముఖ పత్రిక ఫినాన్షియల్ టైమ్స్ పేర్కొంది.
* ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఒంటి గంట సమయానికి సెన్సెక్స్ 150, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ71.00 గా ఉంది.