అమెరికాలోని నార్త్ కరోలినాలో హైదరాబాద్‌కు చెందిన గజం వనిత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆత్మహత్య చేసుకుందంటూ హైదరాబాద్ నాగోల్‌లోని తల్లిదండ్రులకు సమాచారమందింది. అత్తింటి వేధింపులే తమ కుమార్తెను బలి తీసుకున్నాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. భర్తతో విభేదాలు, అత్తింటి వేధింపులు తట్టుకోలేక వనిత కొంతకాలం హైదరాబాద్‌లో ఉంది.భర్తే చంపాడా..?గత జూలైలో వనిత భర్త దగ్గరకు వెళ్లినా రెండు నెలల నుంచి తామెవ్వరితోనూ కాంటాక్ట్‌లో లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. వనిత ముఖంపై దిండుతో అదిమి భర్తే తనను చంపినట్లుగా అక్కడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనానంతరం భర్త రాచకొండ శివకుమార్‌ను కరోలినా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ కూతురి మరణవార్తతో వనిత ఇంట్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
ర్యాలీలో హైదరాబాదీ మహిళ అనుమానస్పద మృతి
Related tags :