కెమెరా ముందుకు వెళ్లానంటే నేను పోషిస్తున్న పాత్ర తప్ప..నా చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తాన్ని మరిచిపోతానని చెబుతోంది సాయిపల్లవి. అందుకే ఆమె నటనలో అంత సహజత్వం కనిపిస్తుంటుంది. నటిగా అంత పరిణతి ఎలా వచ్చిందని అడిగితే ‘‘నాలో ప్రావీణ్యం ఉందనో, పరిణతి చెందాననో ఎప్పుడూ అనుకోను. ఒక కథ చదివేటప్పుడే నేను ఆ కథాంశంలో భాగమైపోతుంటా. అదే నా నటనని మార్చేస్తోందేమో’’ అంటోంది సాయి పల్లవి. నటిగా ఎవరెంతగా మెచ్చుకొన్నా, సినిమా ఫలితం తాలూకు క్రెడిట్ మాత్రం నా సొంతమని ఎప్పుడూ భావించలేదని చెబుతోందామె. ‘‘ఒక సినిమా ఎలా తయారవుతుందో నాకు తెలుసు. వందల మంది కష్టం ఉంటుంది. అందులో ఒకరు లేకపోయినా అనుకున్న పని అనుకున్నట్టుగా పూర్తవ్వదు. కానీ తెరపై కనిపించేది మేమే కాబట్టి మాకు ఎక్కువ గుర్తింపు, పేరు వస్తుంటాయి. కానీ మాకొచ్చిన పేరు వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్లని తప్పకుండా గుర్తు చేసుకుంటుంటా’’ అని చెప్పింది సాయిపల్లవి. ఆమె ‘విరాటపర్వం’తో పాటు నాగచైతన్య చిత్రంలోనూ నటిస్తోంది.
భాగమైపోతాను
Related tags :