నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ యంగ్‌లుక్‌లో స్టైలిష్‌గా ఉన్న స్టిల్ ఇప్పటికే అభిమానులను అలరించింది. ఆ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక విజయదశమి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ.. చిత్రబృందం బాలకృష్ణ కొత్త లుక్‌ను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలో బాలయ్య ఒక చేతిలో కత్తి పట్టుకుని రౌద్రంగా కనిపించారు. మాస్ పల్స్ ఏంటో బాలకృష్ణకు బాగా తెలుసు. అందుకు తగినట్లుగానే చిత్ర బృందం ఈ సినిమాలోనూ యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేసింది. ఆ ఫైట్ సీక్వెన్స్‌లో భాగంగానే బాలయ్య ఇలా కత్తిపట్టుకుని రౌద్రంగా కనిపించారు. ‘యన్.టి.ఆర్’ బయోపిక్ తర్వాత బాలయ్య నటిస్తున్న 105వ సినిమా ఇది. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలు. ప్రకాశ్‌రాజ్, భూమిక, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిరంతన్ భట్ స్వరాలు అందిస్తున్నారు. ‘జైసింహా’ తర్వాత బాలకృష్ణ, నిర్మాత సి.కల్యాణ్, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది.
రుద్రరూప జయ బాలయ్య
Related tags :