NRI-NRT

టోరొంటోలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

TNILIVE Canada Telugu News | Telangana Canada Association TCA Celebrates Batukamma

తెలంగాణ కెనడా సంఘం Telangana Canada Association(TCA) ఆధ్వర్యంలో 5 అక్టోబరు 2019 శనివారం రోజున కెనడా దేశం గ్రేటర్ టోరొంటో లోని లింకన్ అలక్జెండర్ పాఠశాల ఆడిటోరియంలో 1000 మందికి పైగా ప్రవాస తెలంగాణా వాసులు పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సాంప్ర దాయ దుస్తులతో బతుకమ్మ ఆటలు ఆడుతు పాటలు పాడుకొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కెనడా సంఘం ఆద్వర్యంలో మంచి రుచికరమైన భొజనాలు ఏర్పాటు చేసారు. ఈ పండుగ సంబురాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల ఆధ్వర్యంలో జరుగగా ఫౌండేషన్ కమీటీ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ తిరునగరి, ట్రుస్టీ బోర్డు చైర్మన్ శ్రీ హరి రావుల్, ఉపాధ్యక్షులు శ్రీ విజయ్ కుమార్ తిరుమలాపురం, కార్యదర్షి శ్రీ శ్రీనివాస్ మన్నెం, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి దీప గజవాడ, కోషాధికారి శ్రీ దామోదర్ రెడ్డి మాది, డైరక్టర్లు శ్రీ మనోహర్ భొగా, శ్రీమతి మంగ వాసం, శ్రీ మూర్తి కలగోని, శ్రీ గణేశ్ తెరాల, ట్రస్టీలుగా శ్రీ వేనుగోపాల్ రెడ్డి ఏళ్ళ, శ్రీ కిరన్ కుమార్ కామిశెట్టి మరియు శ్రీ నవీన్ ఆకుల, ఫౌండర్లు శ్రీ చంద్ర స్వర్గం, శ్రీ కోటేశ్వరరావు చిత్తలూరి, శ్రీనాధ్ రెడ్డి కుందూరి, శ్రీ రాజేశ్వర్ ఈద, శ్రీ అఖిలేశ్ బెజ్జంకి, శ్రీ దేవెందర్ రెడ్డి గుజ్జుల, శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీ సంతోష్ గజవాడ, శ్రీ వేణుగోపాల్ రోకండ్ల, శ్రీ విద్యాసాగర్ రెడ్డి సారబుడ్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరపు ఉత్తమ బతుకమ్మలకు ప్రైజులను అందజేశారు. బతుకమ్మలను ప్రక్కనేగల హంబర్ నదిలో నిమజ్జనం చేసి సాంప్రదాయ బద్దంగా తయారు చేసుకొని వచ్చిన ఫలహారాలను ఆరగించారు. మహిళలు గౌరమ్మ పసుపు కుంకుమలను పంచుకున్నారు. చివరగా కార్యదర్షి శ్రీ శ్రీనివాస్ మన్నెం మరియు ఉపాధ్యక్షులు శ్రీ విజయకుమార్ తిరుమలాపురం వందన సమర్పణతో 2019 బతుకమ్మ ఉత్సవాలు ముగిసాయి.