విశ్వనిర్మాణంపై పరిశోధనలు చేసిన ముగ్గురికి ‘నోబెల్’
విశ్వనిర్మాణంపై పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలను భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది.
కెనడియన్-అమెరికన్ శాస్త్రవేత్త జేమ్స్ పీబుల్స్, స్విస్ శాస్త్రవేత్తల ద్వయం మిషెల్ మేయర్, డిడియర్ క్యులోజ్కు సంయుక్తంగా అవార్డు ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది.
జేమ్స్… విశ్వనిర్మాణంపై కీలక విషయాలు కనుగొన్నారని నోబెల్ కమిటీ కొనియాడింది. నోబెల్ పురస్కారంలో సగాన్ని ఆయనకు అందిస్తున్నట్లు తెలిపింది.
మిగిలిన సగాన్ని మిషెల్, డిడియర్కు ఇస్తున్నట్లు ప్రకటించింది.
సూర్యుడి తరహా నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఓ గ్రహాన్ని కనుగొన్నందుకు మిషెల్, డిడియర్కు ఈ అవార్డు అందిస్తున్నట్లు వివరించింది నోబెల్ కమిటీ.
నోబెల్ పురస్కారంగా 9 లక్షల 18 వేల డాలర్ల నగదు, పసిడి పతకం, ఒక ధ్రువపత్రం ఇవ్వనున్నారు. డిసెంబర్ 10న స్టాక్హోమ్లో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.