* అవంతిపొరాలో ఎదురుకాల్పులు జరిగాయి. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు ఉగ్రవాదులు ఎదుట పడటంతో దుండగులు కాల్పులు ప్రారంభించారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం అయ్యాడు. ఘటనా స్థలంలో పేలుడు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి పారిపోయిన ఉగ్రవాదుల కోసం బలగాలు గాలిస్తున్నాయి.
* మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఈ నెల 5న సోమాజిగూడలో ఉన్న ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌లో పరీక్షలు నిర్వహించుకోగా.. అతడికి హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నట్లు రిపోర్టు ఇచ్చింది. ఆ తర్వాత ఇతర పరీక్షా కేంద్రాల నుంచి రిపోర్టు తీసుకున్న వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ట్విటర్‌లో ఏకంగా ఆయా రిపోర్టులను అటాచ్ చేసి తనకు న్యాయం చేయాలని కోరాడు.
* పూతికవలస లో ఏనుగులు బీభత్సాన్ని సృష్టించాయి. కురుపాం మేజర్ పంచాయతీలోని పూతికవలస గ్రామంలో సోమవారం రాత్రి మంగ ప్రకాష్ ఇంటి వద్ద నిల్వ ఉన్న వివిధ రకాల పచ్చడి డబ్బాలను ఏనుగులు ధ్వంసం చేసిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. ధ్వంసం చేసిన సామగ్రిని అటవీ రేంజ్ అధికారి ఎం.మురళి కఅష్ణ మంగళవారం ఉదయం పరిశీలించారు.
* గత సంవత్సర కాలంగా తమ దగ్గర బందీలుగా ఉన్న ముగ్గురు భారతీయ ఇంజనీర్లను అఫ్గాన్ తాలిబన్లు సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు తాలిబన్ నాయకులు స్థానిక రేడియో చానల్‌లో మాట్లాడినట్లు మీడియా సంస్థలు కథనాలు రాశాయి.
* విజయనగరం నుండి వస్తున్న పల్లె వెలుగు బస్సు లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కొత్తవలస విజయనగరం రోడ్డు లో అర్ధానపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో చింతలపూడి ప్రకాష్ మృతి చెందగా15 మందికి గాయాలు అయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.