రసాయన శాస్త్రంలో ఇవాళ నోబెల్ అవార్డు విజేతల పేర్లను ప్రకటించారు. ఈ ఏడాది నోబెల్ బహుమతి ముగ్గురికి దక్కింది.
జాన్ బీ గుడెనాఫ్, ఎం స్టాన్లీ విట్టింగ్‌హామ్, అకిరా యొషినోలకు రసాయశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ గెలుచుకున్నారు.
లిథియం ఐయాన్ బ్యాటరీలను అభివృద్ధి పరిచినందుకు ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ వచ్చింది.
స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో ఈ అవార్డులను ప్రకటించారు.
లిథియం బ్యాటరీలు ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు నోబెల్ కమిటీ అభిప్రాయపడింది.
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు.. అన్నింటిలోనూ లిథియం బ్యాటరీలనే వాడుతున్నట్లు నోబెల్ సంస్థ తన ట్వీట్‌లో పేర్కొన్నది.
రసాయన శాస్త్రవేత్తలు తమ ప్రయోగంతో.. వైర్‌లెస్, ఫాసిల్ ఫుయల్, ఫ్రీ సొసైటీని తయారు చేసినట్లు పేర్కొన్నది.