దెందులూరు మాజీ MLA చింతమనేనికి ఈ నెల 23వరకు రిమాండ్ పొడిగింపు
ఏలూరు జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న చింతమనేని అతని అనుచరుడు గద్దేకిషోర్ ను అక్టోబర్ 9తో రిమాండ్ పూర్తి అవడంతో ఎక్సైజ్ కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
గతంలో చింతమనేని దెందులూరు MLA గా ఉన్నసమయంలో 2018 అక్టోబర్ లో పెదవేగి మండలం కొప్పాక గ్రామం లో అక్రమ త్రవ్వకాలు జరుగుతున్నాయనే సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడి చేశి అడ్డుకొనగా చింతమనేని ప్రభాకర్ విధినిర్వహణలో ఉన్న విజిలెన్స్ అధికారుల విధులను ఆటంక పరిచారనే ఆరోపణలో నమోదైన కేసులో పిటి వారెంట్ పై చింతమనేనిని ఈరోజు ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు..
చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు గద్దేకిషోర్ ఎం ఏలియా, చింతమనేని సతీష్, రాజేష్, ఇ శ్రీనివాస్, ఎస్ దిలీప్, ఎం అప్పారావు లను కూడా ఎక్సైజ్ కోర్టులో హాజరుపరచగా వీరికి పాత కేసులు లో ,23వరకూ రిమాండ్ పొడిగించగా ,విజిలెన్స్ అధికారుల విధులను ఆటంకపరిచిన కేసులో కూడా చింతమనేనికి ఈనెల 23 వరకు రిమాండ్ విధించిన న్యాయమూర్తి అనంతరం జిల్లా జైలుకు తరలింపు.