టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచినా..పార్టీ అధికారంలోకి రాలేదు. మాజీ మంత్రిగా చక్రం తిప్పినా..ఇప్పుడు పొలిటికల్ యాక్టివ్ గా లేరు.
టీడీపీలో ఉన్నా..లేనట్లుగానే ఉంటున్నారు. ఆయన పార్టీ వీడటం ఖాయమనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది.
బీజేపీలోకి అని కొన్ని సార్లు..కాదు వైసీపీలో చేరుతున్నారని కొన్ని సార్లు ప్రచారం సాగింది.
గంటా మాత్రం తన రాజకీయ భవిష్యత్ మీద స్పష్టత మాత్రం ఇవ్వలేదు.
గంటా టీడీపీలో కొనసాగుతారా లేదా అనే దానికి సమాధానంగా ఆయన ఈ రోజు పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.
కొద్ది రోజులుగా ఆయన టీడీపీ కార్యాలయం మెట్లు ఎక్కడం లేదు.
అలాగే పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు.
దీంతో..ఆయన టీడీపీలోనే కొనసాగుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
కానీ, ఆయన వ్యతిరేక శిబిరం మాత్రం టీడీపీలో గంటా ఎక్కవ కాలం కొనసాగరని..
ఆయన వైసీపీలో చేరటానికి మంత్రాంగం నడుపుతున్నారని..
అయితే కొన్ని కండీషన్లు అమలు చేయాల్సి ఉందని..దాని కారణంగానే ఆలస్యం అవుతుందని చెబుతున్నారు.