NRI-NRT

రామినేని ఫౌండేషన్ పురస్కారాల ఆహ్వాన పత్రికావిష్కరణ

Raminei Foundation USA Visishta Puraskaram 2019 Invitation Launch

డాక్టర్ రామినేని ఫౌండేషన్ (U.S.A) 20 వ వార్షికోత్సవ వేడుక సందర్భంగా ఈ సంవత్సరం కూడా డాక్టర్ రామినేని పురస్కారాల 2019 ప్రధానోత్సవం ఈనెల 12వ తేదీన నగరంలోని నెక్లెస్ రోడ్ ని జలవిహార్ లో నిర్వహించనుంది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలను అందిస్తున్న ప్రముఖులకు గత 19 సంవత్సరాలుగా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తోంది రామినేని ఫౌండేషన్.

ఈ సందర్భంగా బంజారాహిల్స్ లోని హోటల్ హయత్ ప్లేస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ రామినేని, కన్వీనర్ మరియు గుంటూరు మాజీ జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం లు ఆహ్వాన పత్రికను ఆవిష్కరిస్తూ వివరాలను వెల్లడించారు.

చైర్మన్ ధర్మ ప్రచారక్ రామినేని మాట్లాడుతూ కళలు, ఆర్ట్ మానవీయ, హ్యుమానిటీస్ అండ్ సైన్స్ రంగాల్లో ఉన్న వారికి ఈ పురస్కారాలను అందజేస్తున్నామని వారు వివరించారు. పద్మశ్రీ G.N రావు , ఎల్ వి ప్రసాద్ ఫౌండర్ డైరెక్టర్ ఐ ఇన్స్టిట్యూట్, డాక్టర్ కె రామచంద్రమూర్తి , ఎడిటోరియల్ డైరెక్టర్ సాక్షి మీడియా గ్రూప్ , బి వి పట్టాభిరామ్ హెచ్ ఆర్ డి ట్రైనర్ లు ప్యానెల్ కమిటీ ఈ అవార్డులకు ఎంపిక చేశారని తెలిపారు.

విశిష్ట పురస్కారానికి పీవీ సింధు బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్, విశేష పురస్కారాని కి డాక్టర్ చంద్రశేఖర్ శేఖర్ ఫౌండర్ సంకురాత్రి ఫౌండేషన్, కళారత్న బాల కొండలరావు , కూచిపూడి కళా కేంద్రం ఫౌండర్ , శ్రీ గోరటి వెంకన్న తెలుగు ప్రజాకవి లకు ప్రధానం చేయనున్నట్లు వారు తెలిపారు

ఈ ప్రధాన ఉత్సవానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి , రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ , ప్రతిభ బయోటెక్ ఫౌండర్ లు లు ఎలా సుచిత్ర , కిషన్ ఎలా, మాజీ ఆంధ్ర రంజీ టీం కెప్టెన్ చాముండేశ్వరి నాథ్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారని వివరించారు.