ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమిళ సంప్రదాయ వస్త్రధారణ చేశారు. పంచెకట్టుతో ప్రధాని మహాబలిపురానికి చేరుకున్నారు. శోర్ ఆలయ ప్రాంగణంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు తమిళ సంప్రదాయ వస్త్రధారణలో స్వాగతం పలికారు. మోదీ, జిన్‌పింగ్ ఇరువురు కలిసి చారిత్రక కట్టడాలను వీక్షిస్తున్నారు. వెయ్యేళ్ల నాటి చారిత్రక కట్టడాలను వీక్షిస్తున్నారు. మహాబలిపురం ప్రాశస్త్యాన్ని జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ వివరిస్తున్నారు.
చెన్నైకు చేరుకున్న జిన్‌పింగ్‌కు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి జిన్‌పింగ్ గిండిలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌కు బయల్దేరివెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే మహాబలిపురానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు నేతల మధ్య జరగనున్న రెండో అనధికార సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది.