Agriculture

రైతుభరోసా లబ్ధిదారుల జాబితాలో మంత్రి సురేష్ పేరు

YSRCP Minister Suresh's Name In RythuBharosa Beneficiaries List

రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలో మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు కూడా ఉండటం విశేషం. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరంలో మంత్రి సురేష్ పేరిట 94 సెంట్ల భూమి, కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో.. 19 ఎకరాల భూమి ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తెలిపారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐటీ పరిధిలో ఉన్నవారికి రైతు భరోసా పథకం వర్తించదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలో మంత్రి పేరు ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి