NRI-NRT

ఘనంగా రామినేని ఫౌండేషన్ 2019 పురస్కార ప్రదానోత్సవం

Ramineni Foundation 2019 Puraskaram Delivered To PV Sindhu et al - ఘనంగా రామినేని ఫౌండేషన్ 2019 పురస్కార ప్రదానోత్సవం

డాక్టర్ రామినేని ఫౌండేషన్ పీవీ సింధు, గోరటి వెంకన్నలకు పురస్కారాలను ప్రదానం చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ రామినేని ఫౌండేషన్ 20వ వార్షికోత్సవ వేడుకను పురస్కరించుకొని డాక్టర్ రామినేని పురస్కారాలను ప్రముఖులకు అందజేసింది. హైదరాబాద్ నగరంలోని నెక్లెస్ రోడ్ నిజలవిహార్ లో శనివారం సాయంత్రం ఈ పురస్కారం-2019 జరిగింది. విశిష్ట పురస్కారానికి ఎంపికైన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, విశేష పురస్కారానికి డాక్టర్ చంద్రశేఖర్ సంకురాత్రి, కళారత్న ఏ.బి.బాల కొండలరావు, గాయకుడు గోరటి వెంకన్నలకు మంత్రి ఎర్రబెల్లి పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ రామినేని, కన్వీనర్ మరియు గుంటూరు మాజీ జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణంలు ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలను అందిస్తున్న ప్రముఖులకు గత 19 సంవత్సరాలుగా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తోందనీ… కళలు, మానవీయ, సైన్స్ రంగాల్లో ఉన్న వారికి ఈ పురస్కారాలను అందజేయడం అభినందనీయమని మంత్రి అన్నారు. రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, ప్రతిభ బయోటెక్ ఫౌండర్లు ఎల్లా సుచిత్ర, మాజీ ఆంధ్ర రంజీ టీం కెప్టెన్ చాముండేశ్వరినాథ్, తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.