ScienceAndTech

అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యోమగామి మృతి

Russian Astronaut Alexei Leonov Passes Away At 85

అంతరిక్షంలో మొట్టమొదటి సారి నడిచిన రష్యా వ్యోమగామి అలెక్సీ లియోనోవ్‌(85) శుక్రవారం కన్నుమూశారు.

ఆయన చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ మాస్కోలో చనిపోయారు. మంగళవారం అంత్యక్రియలు జరగనున్నాయి.

లియోనోవ్‌ మరణవార్త చాలా బాధ కలిగించిందని రష్యా స్పేస్‌ ఏజెన్సీ రాస్‌కాస్మోస్‌ తెలిపింది.

లియోనోవ్‌ 1965లో అంతరిక్ష యాత్ర చేశారు. అప్పుడు ఆయన 12 నిమిషాల 9 సెకన్ల పాటు అంతరిక్షంలో నడిచారు.

దీంతో స్పేస్‌ వాక్‌ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు.

అప్పుడు ఆయనతో పాటు పావెల్‌ అనే వ్యోమగామి కూడా అంతరిక్షయానం చేశారు.

అయితే వీరి అంతరిక్ష యాత్ర విజయవంతంగా ముగిసినప్పటికీ వీరు ప్రయాణించిన రాకెట్‌ క్రాష్‌ ల్యాండ్‌ అయింది. లియోనోవ్‌ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.