పండగ సమయంలో రకరకాల నగలు పెట్టుకుని ఇప్పుడు భద్రపరిచే పనిలో ఉన్నారా… ఈ జాగ్రత్తలు తీసుకుని చూడండి.
* ఆభరణాల శుభ్రతలో యాసిడ్, ఆల్కహాల్, వెనిగర్ లాంటి వాటిని వాడకూడదు.
* ముత్యాల హారం భద్రపరిచే ముందు… మృదువైన నూలు వస్త్రంతో తుడిచి, మల్ వస్త్రంలో చుట్టండి. వీటిని మిగిలిన నగలకు దూరంగా పెట్టాలి. లేదంటే గీతలు పడతాయి.
* రాళ్లు పొదిగిన నగల్ని, మిగిలినవాటితో కలపకపోవడమే మంచిది. వాటిని అన్నింటికీ విడిగా డబ్బాల్లో లేదా జిప్ ఉండే వెల్వెట్ పర్సుల్లో భద్రపరచాలి. వెండి నగలూ అంతే. వాటిని గాలి తగలని టార్నిష్ వస్త్రంలో ఉంచి, భద్రపరచాలి.
* వజ్రాలు చాలా ఖరీదైనవి. పదునైనవి. వీటిని బంగారం, వెండి, ఇతర రాళ్లు పొదిగిన నగలతో కాకుండా విడిగా ఉంచాలి. మెత్తని సంచుల్లో ఉంచితే మంచిది.
నగలు భద్రపరుచుకునే చిట్కాలు
Related tags :