ఈ నెల 15వ తేదీన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రారంభం కాబోతున్నది. నెల్లూరు నగర సమీపంలోని కాకుటూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. తొలుత ఆయన ఆరోజు ఉదయం 10.30గంటలకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణం చేరుకుంటారు. ఆ తరువాత కౌలు రైతులకు కార్డుల పంపిణీ అనంతరం రైతులకు వైఎస్సార్ రైతుభరోసా చెక్కులను పంపిణీ చేసి అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు వైస్సార్‌సీపీ నేతలు,అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
నెల్లూరు జిల్లా నుండి రైతు భరోసా ప్రారంభం
Related tags :