దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం సహజంగానే ఎక్కువ. కాగా ఈ కాలుష్యస్థాయి గడిచిన వారం రోజులుగా పెరుగుతూ పోతుంది. గాలి నాణ్యత పడిపోయింది.
గాలి కాలుష్య తీవ్రత నాల్గొవ రోజు కూడా కొనసాగింది.
గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) ప్రకారం శుక్రవారం నాడు 208, శనివారం 222 ఉండగా నేడు ఏక్యూఐ 256గా నమోదైంది.
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రిసెర్చ్ ప్రకారం ఢిల్లీ పరిసర ప్రాంతాలైన ఆనంద్ విహార్, వాజీపూర్‌లో ఆందోళనకరస్థాయిలో ఏక్యూఐ 300గా నమోదైంది.
పంజాబ్, హార్యానాలో వ్యవసాయ వ్యర్థాల కాల్చివేత వల్ల గాలి కాలుష్యం తీవ్రంగా పెరిగి అది ఢిల్లీకి వ్యాప్తిచెందుతున్నట్లుగా సమాచారం.