Health

కళ్లు పొడిబారితే ప్రమాదం మిత్రమా!

కళ్లు పొడిబారితే ప్రమాదం మిత్రమా! - Do Not Let Your Eyes Go Dry - It Is Very Dangerous

కన్నీళ్లే కదా అని తీసిపారేయొద్దు!! అవి తక్కువైతే పొడికళ్ల వ్యాధి వస్తుంది!! దాని బారినపడిన వారు కళ్ల మంట, తీక్షణమైన కాంతిని చూడలేని దుస్థితిని ఎదుర్కొంటారు. ఈ రోగులకు ఉపశమనం కలిగించే కంటి చుక్కల(ఐ డ్రాప్స్‌)ను అమెరికాలోని చికాగోలో ఉండే ఇల్లినాయిస్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచారు. ఇందుకోసం ఆరోగ్యవంతులైన వేలాది మంది దాతల నుంచి రక్తం సేకరించారు. ఆ రక్తంలోని ‘ఇమ్యూన్‌ గ్లోబులిన్‌’ అనే ప్రతిరక్షక పదార్థాన్ని శుద్ధిచేసి.. కంటి చుక్కలను రూపొందించారు. 8 వారాల ప్రయోగాల అనంతరం.. ప్రతిరక్షకంతో రూపొందించిన ఐ డ్రాప్స్‌ వాడిన వారిలో పొడికళ్ల సమస్య తగ్గినట్లు గుర్తించారు.