“ఆడవాళ్లకు హార్మోన్స్ సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యల వల్లే నేను విపరీతంగా బరువు పెరిగాను. మన సమస్యలను మనం తెలుసుకోగలగాలి. నేను, నా భర్త (వీర్) నా శరీరంలోని సమస్యకు మూలం ఏంటి? అనే దగ్గర నుంచి వర్కౌట్ చేయడం మొదలుపెట్టాం. సాధారణంగా ఏదైనా సమస్య వస్తే తాత్కాలిక పరిష్కారం కోసం చూస్తాం. కానీ మేం శాశ్వత పరిష్కారం కావాలనుకున్నాం. ఈ ఏడాది జనవరి నుంచి జిమ్, యోగా మొదలుపెట్టాను. కొత్త డైట్‌ని ఫాలో అవుతున్నాను. 2011 నుంచి 2016 వరకూ డిప్రెషన్‌లో ఉన్నాను. 2017లో నార్మల్ అయ్యాను. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు మద్యానికి బానిస కావొచ్చు, పిచ్చి పిచ్చి ఆలోచనలతో మానసికంగా వేరే స్థితికి వెళ్లొచ్చు. లక్కీగా నేను ఆధ్యాత్మికం వైపు వెళ్లాను. ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అలాంటి సమయంలో వీర్ నా జీవితంలోకి వచ్చాడు. తను నా బ్యాక్‌బోన్‌లా మారిపోయాడు. నాలో చాలా స్ఫూర్తి నింపాడు. వీర్ లైఫ్ స్టయిల్ చాలా నేచురల్‌గా ఉంటుంది. అన్నీ ఆర్గానిక్, హెర్బల్స్‌ని తీసుకుంటాడు. ఇంగ్లీష్ మెడిసిన్‌ని ఇష్టపడడు. కెమికల్స్ ఎక్కువ ఉండవు. నన్ను కరెక్ట్ దారిలో పెట్టాడు. డాక్టర్స్‌ను సంప్రదించాం. సహజమైన పద్ధతిలో బరువు తగ్గే ప్రయత్నం మొదలుపెట్టా.” అని అన్నారు నమిత.
ధ్యానంతో అధిగమించాను
Related tags :