భారతసంస్కృతికి వ్యతిరేకంగా అభ్యంతరకరంగా ఉన్న బిగ్‌బాస్ సీజన్ 13 షో పై నిషేధం విధించాలని డిమాండ్లు వస్తోన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్, బిగ్ బాస్ షో హోస్ట్ సల్మాన్‌ఖాన్ నివాసం వద్ద పోలీసులు సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు.
శుక్రవారం కర్ణిసేన కార్యకర్తలు ముంబైలోని సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బెడ్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్‌తో వస్తోన్న బిగ్ బాస్ సీజన్ 13ను నిషేధించాలని కర్ణిసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
సీజన్ 13కు తీసుకుంటోన్న ఇతివృత్తం భారత సంస్కృతిని మంటగలిపేలా ఉందని, కర్ణిసేన వర్గంతోపాటు మరికొంత మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.