గల్ఫ్ దేశంలోని తెలంగాణా ఎన్నారైల సమస్యలను క్షుణ్నంగా అధ్యయనం చేసి వారి భద్రతకు, అభివృద్ధికి పెద్దపీట వేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన ఎన్నారై పాలసీని రూపొందించే నిమిత్తం చిత్తశుద్ధితో యంత్రాంగాన్ని కదిలిస్తున్నారని ఎన్నారై తెరాస సమన్వయకర్త బిగాల మహేశ్ పేర్కొన్నారు. దుబాయి క్షమాభిక్షను వినియోగించుకుని 600మంది తెలంగాణా ఎన్నారైలను స్వరాష్ట్రానికి తీసుకు వచ్చామని, ఎన్నారై పాలసీపై అధ్యయనం జరిపేందుకు కేరళకు ఒక బృందాన్ని తెలంగాణా ప్రభుత్వం పంపిస్తోందని మహేశ్ తెలిపారు. హుజూర్‌నగర్ ఉప-ఎన్నికల్లో ఎన్నారై సైదిరెడ్డి గెలుపు తమ విభాగం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తెరాస ప్రతినిధులు గనగోని శ్రీనివాస్, నల్లమాడ దేవేంద్ర, మలై శ్రీనివాస్, గజ్జల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నారై పాలసీ పట్ల కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారు-మహేశ్ బిగాల
Related tags :