యువనేతకు ఒక్కరోజైనా పెళ్లంగా ఉంటా..
తరువాత చచ్చినా పర్లేదంటున్న శ్రీరెడ్డి
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. కర్నూల్ రాజకీయాల్లో ఈ యువనేత ఇప్పుడో సంచలనం అనే చెప్పాలి.
కర్నూల్ జిల్లా నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌గా ఉన్న ఈ యువనేత గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఆర్థర్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కొడుకే ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మంచి వాక్చాతుర్యంతో పాటు యూత్‌లో మాస్ లీడర్‌గా పేరొందారు బైరెడ్డి సిద్దార్ధ.
ఈ యువనేతను గత ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని మాట ఇవ్వడంతో బైరెడ్డి వైసీపీలో బలమైన యువ నాయకుడుగా మారారు.
ఇప్పుడు అతని గురించి ఎందుకు చర్చ అంటే.. ఈ యువ నాయకుడిపై మనసు పారేసుకుంది
వివాదాస్పద నటి శ్రీరెడ్డి. ‘బైరెడ్డి.. నువ్ మాగాడివిరా బుజ్జీ’ అంటూ అతనికి కనీసం ఒక్కరోజైనా పెళ్లాంగా ఉంటే చాలు అంటూ హాట్ కామెంట్స్ చేస్తుంది శ్రీరెడ్డి.
మరి ఈ రెడ్డిలో శ్రీరెడ్డికి ఏం నచ్చిందో తెలియదు కాని.. బైరెడ్డిపై వరుస పోస్ట్‌లు పెడుతోంది. ‘నేను తొలిసారిగా నా పెళ్లి గురించి పోస్ట్ పెడుతున్నా..
బెరెడ్డి సిద్దార్ధ రెడ్డికి కనీసం ఒక్కరోజైనా పెళ్లాంగా ఉంటే చాలు.. ఆ తరువాత చనిపోయినా పర్లేదు.. నువ్ మగాడివిరా బుజ్జీ’ అంటూ ఆ యువనాయుడ్ని మొగుడుగా కావాలంటోంది శ్రీరెడ్డి.
అసలే మనోడికి ఆవేశం ఎక్కువ.. పైగా సోషల్ మీడియాలో కూడా శ్రీరెడ్డి మాదిరే బాగా యాక్టివ్ కూడానూ..
మరి తనపై మనసు పారేసుకున్న శ్రీరెడ్డి పోస్ట్‌లపై బైరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.