తన నటనతో ఆకట్టుకుంటూ వరుసగా హిట్లతో బాలీవుడ్, కోలివుడ్‌లో దూసుకుపోతుంది అందాల భామ తాప్సీ. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో నటిస్తూ వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా హర్యానాకు చెందిన ప్రముఖ షూటింగ్ సిస్టర్స్ చంద్రో, ప్రకాశీల జీవిత కథ ఆధారంగా ‘సాండ్ కి ఆంఖ్’ చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరస హిట్లు రావడంతో తన రెమ్యూనరేషన్ భారీగా పెంచిందని బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. దీనిపై తాప్సి తాజాగా స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గత రెండేళ్లలో తన పారితోషకం బారీగా పెరిగిందని.. అయితే తనతో పాటు నటిస్తున్న నటులతో పోలిస్తే అది చాలా తక్కువేనని చెప్పుకొచ్చింది.
నాది ఎక్కువే
Related tags :