ScienceAndTech

ఈ ఏడాది కొత్త స్పెక్ట్రమ్‌ ప్రకటన

Indian IT Minister Announces New Spectrum Details

ఈ ఏడాది కొత్త స్పెక్ట్రమ్‌ ప్రకటన ఉంటుంది అని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.

కొత్త స్పెక్ట్రమ్‌కు త్వరలోనే టెండర్లు ప్రకటిస్తామన్నారు. ఢిల్లీ ఏరోసిటీ వేదికగా ప్రారంభమైన ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ -2019 సదస్సులో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు.

కొత్త స్పెక్ట్రమ్‌ ధరల విషయంలో సరికొత్త విధానానికి శ్రీకారం చుడుతామని ఆయన చెప్పారు.

టెలికాం, ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీకి భారత్‌ హబ్‌గా మారింది.

మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరింది. 2022 నాటికి బ్రాండ్ బాండ్ అందరికి అందుబాటులోకి వస్తుందన్నారు.

2016 నవంబర్ లో డిజిటల్ లావాదేవీలు 980 మిలియన్లు ఉంటే.. ఈ సంఖ్య ఇప్పుడు 3.32 బిలియన్ కు చేరిందన్నారు.

సైబర్ సెక్యూరిటికీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. 5జీ సేవలు తీసుకువచ్చేందుకు కొన్ని సంస్థలకే అనుమతి ఇచ్చామని రవిశంకర ప్రసాద్‌ స్పష్టం చేశారు.

ఈ సదస్సు నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగనుంది. 5జీ టెక్నాలజీ, ఫైబర్‌నెట్‌, డిజిటల్‌ పరిజ్ఞానంలో మార్పులపై సెమినార్లు నిర్వహించనున్నారు.

ఈ సదస్సుకు 40 దేశాల నుంచి పలు మొబైల్‌, అనుబంధ రంగాల కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.

ఇక ప్రముఖ టెలికాం కంపెనీలు, ఫేస్‌బుక్‌ వంటి దిగ్గజ సంస్థల స్టాళ్లను ఏర్పాటు చేశారు.