30 ఇయర్స్ పృథ్వికి చెక్ మేట్ పెట్టిన జగన్, అర్ధరాత్రి అదిరే ఝలక్ ..
తెలుగు కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వి 2019 ఎన్నికల ముందు నుండి వైసీపీ వైపు ప్రచారం చేశాడు.
జగన్ సీఎం అయినా తర్వాత టాలీవుడ్ పెద్దల మీదే పృథ్వి విమర్శలు చేశాడు.
జగన్ సీఎం అయితే టాలీవుడ్ పెద్దలు తట్టుకోలేకపోయారు. ఎవరు కూడా జగన్ కి విషెష్ చెప్పలేదంటూ నాన రచ్చ చేశాడు.
దీనితో చాలా మంది మూవీ మేకర్స్ తనకి అవకాశాలు ఇవ్వటంలేదని ఎలాగైనా నన్ను ఆదుకోవాలని వైసీపీ పెద్దల వద్ద మొరపెట్టుకున్నాడు
దీనితో ఆయనకి SVBC ఛానల్ చైర్మన్ పదవి లభించింది. దీనితో అతనికి మళ్ళీ సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయి.
సానుభూతి కోసం కొన్ని రోజులు సినిమాలు ఒప్పుకోకుండా నన్ను టాలీవుడ్ పక్కన పెట్టిందంటూ మొసలి కన్నీరు కార్చి ఛైర్మన్ పదవి తెచ్చుకున్నాడనే మాటలు వినవచ్చాయి.
ఆ పదవిని అడ్డం పెట్టుకొని టాలీవుడ్ లో ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. టాలీవుడ్ మొత్తం ఫ్రీ గా పనిచేయాలని,
ఎవరికీ డబ్బులు ఇచ్చేది లేదంటూ కీరవాణి,సునీత లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు పృథ్వి.
అదే విధంగా SVBC ఛానల్ కి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ లో వేలుపెడుతూ ఉద్యోగులకి తగిన ఫ్రీడమ్ ఇవ్వటం లేదనే మాటలు కూడా వినవస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో కొత్తగా SVBC ఛానల్ లోకి యాంకర్ స్వప్న, నాగార్జున తో డమరుకం సినిమా తీసిన డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలను డైరెక్టర్స్ నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నాడు.
SVBC ఛైర్మన్ గా పృథ్వి ఉన్నకాని, చాలా కీలక విషయాల్లో నిర్ణయం వీళ్లది ఉంటుంది. ఇది ఒక రకంగా పృథ్వికి చెక్ పెట్టినట్లే లెక్క..
పాపం పృథ్వికి ఎంత కష్టం వచ్చిందో.. ఇదిలా ఉంటె దర్శకుడు శ్రీనివాస్ రెడ్డికి డైరెక్టరుగా బాధ్యతలు అప్పగించడం విశేషం. కాగా శ్రీనివాసరెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి.