టీఎస్‌ఆర్టీసీ కార్మికులు బంద్‌కు జనసేనాని పవన్‌కల్యాణ్ మద్దతు ప్రకటించారు.
ఈనెల 19న రాష్ట్ర బంద్‌కు జనసేన పార్టీ మద్దతిస్తోందని తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యపై జనసేనాని పవన్‌కల్యాణ్ చెలించిపోయారు.
ఆర్టీసీ కార్మికులు శ్రీనివాసరెడ్డి, సురేందర్‌గౌడ్ ఆత్మహత్యలు బాధాకరమన్నారు.
ఇకపై ఇలాంటి బలిదానాలు జరగకూడదని ఆయన సూచించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చిందని చెప్పారు.
48 వేలమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం ఆవేదన కలిగిస్తోందని, సమ్మె జఠిలం కాకుండా సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌కు పవన్‌కల్యాణ్ సూచించారు.
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై పవన్ మొదటి నుంచి సానుకూలంగా స్పందిస్తున్నారు.
ఉద్యోగులపై ఉదారతను చూపాలని, వాళ్ల సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని కేసీఆర్‌కు పవన్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
సకల జనుల సమ్మెలో పాల్గొనడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఆర్టీసీ ఉద్యోగులు అండగా నిలిచారని, వారు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలని కోరారు.
1200 మంది మినహా వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించినట్టుగా వస్తున్న వార్తలు కలవరానికి గురిచేస్తున్నాయని పవన్ పేర్కొన్నారు.