బీసీసీఐ అధ్యక్ష పదవికి భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇవాళ ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ వేశారు.
బీసీసీఐ కార్యదర్శి పదవికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా, బీసీసీఐ కోశాధికారి పదవికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ అనంతరం దాదా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ పదవిని నేను ఎప్పుడూ ఆశించలేదు. కనీసం ఎవరితోనూ చెప్పలేదు.
నిన్న రాత్రి 10:30 వరకు కూడా ఈ విషయం నాకు తెలియదు. అప్పుడే చెప్పారు నువ్వే బీసీసీఐ ప్రెసిడెంట్ కావాలని.
గతంలో క్రికెట్ సంక్షోభంలో ఉన్నప్పుడు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టా. క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతలు చేపడుతున్నా.
బీసీసీఐలో పరిస్థితులు చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. మరికొన్ని నెలల్లో అన్ని వ్యవస్థలు ప్రక్షాళన చేసి.. మళ్లీ భారత క్రికెట్‌కు పూర్వవైభవం తీసుకొస్తాం.
నా దృష్టంతా క్రికెట్‌పైనే ఉంటుంది. ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ల వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని’ దాదా పేర్కొన్నారు.