అమెరికాలోని బోస్టన్ నగరంలో విజయదశమి సందర్బంగా అక్టోబర్ 12న అమెరికన్ తెలుగు అసోసియేషన్( ఆటా) ఆధ్వర్యంలో దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకను షమీ పూజతో ప్రారంభించి కార్యక్రమం ఆసాంతం ఆట పాటలతో వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటా అధ్యక్షులు పరమేష్ భీంరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి సాంప్రదాయలు భావితరాలకు తెలియ చేసే విధంగా మన పండుగలు జరుపుకోవాలని తెలిపారు. రాబోయే సంవత్సరం లాస్ ఏంజిల్స్ లో జరగబోయే ఆటా మహాసభలకు ఈ వేడుకలో పాల్గొన్న వారందరిని ఆహ్వనిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి దసరా వంటకాలతో పసందైన విందు భోజనాలు ఏర్పాటు చేశారు. తెలుగు సంస్కృతికి , సామజిక సేవ సహాయ సహకారం అందించినవారందరిని ఘనంగా సన్మానించారు. ఆటా కార్యవర్గ సభ్యులు రమేష్ నల్లవోలు, కృష్ణ ధ్యాప , రీజినల్ డైరెక్టర్ సోమశేఖర్ నల్లా, రీజినల్ కోఆర్డినేటర్ మల్లారెడ్డి యానాల, బోస్టన్ స్థానిక కోఆర్డినేటర్స్ శశికాంత్ పసునూరి, దామోదర్ పాదూరి, రవి కుమార్, అనిత యాగ్నిక్, మధు యానాల, సునీత నల్లా, శిల్ప శ్రీపురం, సాహితి రొండ్ల, పార్వతి సూసర్ల, అపర్ణ పాదూరి, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
బోస్టన్‌లో ఆటా దసరా వేడుకలు
Related tags :