NRI-NRT

అట్లాంటాలో GATES దసరా

Greater Atlanta Telangana Society GATES Celebrates 2019 Dasara

గ్రేటర్‌ అట్లాంటా తెలంగాణ సొసైటీ (గేట్స్‌) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలను న్యూయార్క్‌లోని రివర్స్‌సైడ్‌ పార్క్‌ నదీ తీరానా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మహిళలు రంగురంగుల బతుకమ్మలతో పెద్ద ఎత్తున హాజరై తమ ఆట పాటలతో అలరించారు. తర్వాత గేట్స్‌ అధ్యక్షుడు తిరుమల్‌ రెడ్డి జమ్మిచెట్టుకు పూజ నిర్వహించి దసరా వేడుకలను ప్రారంభించారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి పల్లకీ ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.