WorldWonders

₹100 కోసం కత్తితో 30పోట్లు

https://m.hindustantimes.com/rf/image_size_640x362/HT/p2/2016/01/25/Pictures/murder-torture-humiliation_2f20fbfa-c364-11e5-878d-765e7b48378d.jpg

వంద రూపాయలు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించడంతో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన ముంబయిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముంబయిలోని కామాఠిపుర ప్రాంతానికి చెందిన ఓ సెక్స్‌వర్కర్‌తో ఓ వ్యక్తి రూ.500లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే సదరు వ్యక్తి ఆమెను రూ.100 తిరిగి ఇవ్వమన్నాడు. దానికి ఆ మహిళ నిరాకరించడంతో కాసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆ వ్యక్తి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను 30 సార్లు పొడిచి చంపాడు. మహిళ కేకలు విన్న ఓ వ్యక్తి ఆమెను రక్షించడానికి రావడంతో నిందితుడు అతడిని కూడా పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు నిందితుడిని క్యాటరింగ్‌ చేసే వ్యక్తిగా గుర్తించి అరెస్ట్‌ చేశారు.