Movies

బోల్డ్ ఈజ్ గోల్డ్

Mehreen Ready For Bold Roles In Cinema

`కృష్ణగాడి వీరప్రేమగాథ` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పంజాబీ అందం మెహ్రీన్ ఫిర్జాదా పలు హిట్ సినిమాల్లో నటించింది. గతేడాది వరుస పరాజయాలతో డీలా పడినా.. ఈ ఏడాది సంక్రాంతికి `ఎఫ్2`తో బ్లాక్‌బస్టర్ విజయం అందుకుంది. వెండితెరపై గ్లామరస్‌గా కనిపించడానికి వెనుకాడని మెహ్రీన్.. బోల్డ్ పాత్రల్లో సైతం నటించేందుకు సిద్ధమేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. `కథాపరంగా బోల్డ్ పాత్రలో నటించడానికి నేను సిద్ధం. కొందరు అలాంటి పాత్రలు చేయడానికి సిద్ధపడరు. కానీ, నాకు మాత్రం అలాంటి ఛాలెంజ్‌లు అంటే ఇష్టం. తెరపై బోల్డ్‌గా కనిపించేందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అవకాశం వస్తే నేను రెడీ` అని మెహ్రీన్ చెప్పింది.