పారితోషికం విషయంలో తారతమ్యాల గురించి చాలా మంది హీరోయిన్లు కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా కోసం హీరోలు, హీరోయిన్లు ఒకేలా కష్టపడుతున్నప్పటికీ పారితోషికం విషయంలో మాత్రం చాలా తేడా ఉంటోందని, హీరోలు తీసుకునే పారితోషికంలో సగం కూడా హీరోయిన్లకు ఉండదని చాలా మంది ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్‌తో పోల్చుకుంటే దక్షిణాదిన ఈ వివక్ష మరింత ఎక్కువగా ఉంటుంది. దీని గురించి తాజాగా సీనియర్ హీరోయిన్ ప్రియమణి స్పందించింది. `బాలీవుడ్ కంటే దక్షిణాదిన పరిస్థితి మరింత దారుణం. ఒక సినిమా విజయవంతమైనప్పటికీ హీరోయిన్‌కు పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ, హీరో పారితోషికం మాత్రం తర్వాతి సినిమాకు భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం సమంత, అనుష్క, నయనతార వంటి హీరోయిన్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. ఇప్పటికైనా మహిళలు రెమ్యునరేషన్ గురించి మాట్లాడడం సంతోషకర విషయమేన`ని ప్రియమణి చెప్పింది.
ప్రియమణి ఫిర్యాదులు
Related tags :