* ఇది గమనించారా? నగదు విత్ డ్రా చేసేందుకు ఏటీఎంలకు వెళ్లినప్పుడు ఇదివరకటిలా రూ.2వేల నోట్లు రావడం లేదు. ఎందుకంటే.. ఆ నోట్ల ముద్రణను ఆర్‌బీఐ నిలిపివేయడమే అందుక్కారణం. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూ.2000 నోటునూ ముద్రించలేదని ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. ఓ వార్త ప్రసార సంస్థ అడిగిన ప్రశ్నకు సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలను ఆర్‌బీఐ వెల్లడించింది.
* దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 292 పాయింట్లు పెరిగి 38,506 వద్ద, నిఫ్టీ 87 పెరిగి 11,428 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ముఖ్యంగా బ్లూచిప్ షేర్లను బాగా కొనుగోలు చేశారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఐటీసీ, మారుతీ షేర్లు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 27 లాభపడ్డాయి. వేదాంత షేర్లు 4శాతం మేరకు ఎగశాయి. నిఫ్టీ ఐటీ సూచీ తప్ప మిగిలినవి మొత్తం లాభాల్లో ముగిశాయి.