WorldWonders

తిరుమలగిరుల్లో అద్భుత దృశ్యం

Clouds In Tirumala-A Lifetime View To Be Mesmerized

మేఘాలు చేతికందితే.. మన కళ్లెదురుగా నిలబడి మనతోపాటు ఫొటోలకు ఫోజులిస్తే… గాల్లో తేలుతున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి అద్భుత దృశ్యమే తిరుమల గిరుల్లో ఆవిష్కృతమైంది.

కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పచ్చనిచెట్లు.. మంచుపొరలతో ప్రకృతి రమణీయత ఆహ్లాదాన్ని పంచుతోంది.

బుధవారం రెండో కనుమదారిలో కనిపించిన మేఘాలు గ్రాఫిక్స్‌ సినిమాకు తీసిపోని విధంగా  మైమరిపించాయి.

పాల నురగలా దట్టంగా కనిపిస్తూ..శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు దారిలోనే విశ్రమించి ఆస్వాదించేలా చేశాయి.