ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ వేతనాలు సోమవారం లోపు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాల చెల్లింపులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.
ఆర్టీసీ యాజమాన్యం సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించలేదని జాతీయ టీఎంయూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
49,190 మంది కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. సోమవారం లోగా కార్మికులకు జీతాలు చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది.
సిబ్బంది సమ్మె వల్లే జీతాల చెల్లింపుల్లో ఆలస్యమైందని, సోమవారం లోగా జీతాలు చెల్లిస్తామని కోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.