ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌కు సంబంధించి అక్కడి ప్రభుత్వ మీడియా విడుదల చేసిన చిత్రాలు తాజాగా సంచలనం సృష్టిస్తున్నాయి.
ఆ దేశంలోనే అత్యంత పవిత్ర పర్వతమైన ‘పయక్టూ’ మీద తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తున్న కిమ్ చిత్రాలు అక్కడి ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తాయి.
కిమ్ కొత్త ఆపరేషన్‌కు తెరతీశారా అని వారు చర్చించుకుంటున్నారు. అయితే వారలా భావించటం వెనుక బలమైన కారణమే ఉంది.
కొరియన్ విప్లవానికి, కిమ్ వంశానికీ ఆ పర్వతంతో చారిత్రాత్మకమైన సంబంధం ఉంది. దీంతో ప్రజలు, ప్రభుత్వాధికారులు మరో గొప్ప ఆపరేషన్‌కు దీన్ని సంకేతంగా భావిస్తున్నారు.
ప్రపంచం అబ్బురపడే రితీలో ఉత్తర కొరియా అడుగులు వేయబోతోందని వారు భావిస్తున్నారు.
గతంలో విధానపరమైన కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో కిమ్ అనేక సార్లు ఈ ప్రవిత్ర పర్వతంపైకి వెళ్లారు.
దీంతో కిమ్ నుంచి మరో కీలక నిర్ణయం వెలువడనుందని ప్రజలు భావిస్తున్నారు.
2017లో ఆ దేశం చేపట్టిన అతి పెద్ద ఖండాంతర క్షిపణి పరీక్షల ముందు కూడా పయక్టూ పర్వతంపై కిమ్ వెళ్లిన విషయాన్ని వారు గుర్తుచేసుకుంటున్నారు.
కాగా..అంతర్జాతీయ విశ్లేషకులు మాత్రం..పాశ్చాత్య విధానాలపై కిమ్ ధిక్కార ధోరణికి దీన్ని సంకేతంగా భావిస్తున్నారు.