* మాజీ ఎమ్మెల్యే చింతమనేని మరోసారి అరెస్ట్. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను మరోసారి అరెస్ట్ చేశారు. ఏలూరు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల విషయంలో పీటీ వారెంట్ పై ఈ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చింతమనేనిని ఏలూరు జిల్లా జైలు నుండి విజయవాడ కోర్టుకు తీసుకెళ్తున్నారు.
* కోడెల కుమార్తె పై ఉన్న కేసుల్లో ఛృఫ్ఛ్ 41అ అనుసరించండి : హైకోర్టు. దివంగత నేత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె పూనాటి విజయలక్ష్మి పై నమోదు చేసిన కేసుల్లో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం నోటీసు ఇచ్చి వివరణ కోరడం తదితర విధానాలను అనుసరించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్ మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. విజయలక్ష్మి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ అనంతరం ఆదేశాలు జారీ చేశారు.
* కచ్చులూరు బోటు వెలికితీత పనులు పునఃప్రారంభం. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ఠ బోటును వెలికితీసే పనులను మళ్ళీ మొదలుపెట్టారు. ఈ ఉదయమే ధర్మాడీ సత్యం బృందం దేవీపట్నం నుండి కచ్చులూరుకు చేరుకొని పనులను మొదలుపెట్టారు.
* దగదర్తి మండలం లయన్స్ నగర్ జాతీయ రహదారిపై శ్ ళ్ ట్రావెల్ బస్సును వెనుకనుంచి డీ కొట్టిన లారీ. ఒకరు మృతి 10 మందికి గాయాలు. గాయపడ్డ వారిని నెల్లూరు ప్రభుత్వ హస్పటల్ కు తరలింపు.
* టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ న్యాయస్థానానికి రవిప్రకాశ్ విజ్ఞప్తి చేశారు. రూ.18 కోట్లకు సంబంధించిన కేసులో బంజారాహిల్స్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయాన్ని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నవంబర్ 2 వరకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని.. బంజారాహిల్స్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చేనెల 2కు వాయిదా వేసింది.
* స్కూటీ ని ఢీ కొన్న కారు .. మహిళ మృతి. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు మోడల్ డైరీ సమీపంలో స్కూటీ ని ఢీ కొన్న కారు. స్కూటీ పై ప్రయాణిస్తున్న ఇరువురిలో ఒకరు మృతి. ఇంకొకరి పరిస్థితి విషమం. ఉదయగిరి హరిప్రియ అక్కడికక్కడే మృతి చెందింది.
* కానిస్టేబుల్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాం హౌస్ లో తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆత్మహత్య. గజ్వేల్ ఆసుపత్రిలో వెంకటేశ్వర్లు మృతదేహం. నల్గొండ జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు 12 వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్.
* “కృష్ణాజిల్లా మచిలీపట్నం ఆంధ్రజ్యోతి విలేఖరి సత్యనారాయణ దారుణ హత్య మా దృష్టికి వచ్చింది. హత్య జరిగిన వెంటనే సమాచార శాఖ మంత్రిగా తాను నెల్లూరు పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లా. దీనిపై సీఎం తీవ్రంగా స్పందించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఇప్పటికే డీజీపీని ఆదేశించారు.” మంత్రి నాని.
* వివేకా హత్య కేసు విషయంలో టిడిపి నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు పెద్ద చిక్కు తెచ్చిపెట్టాయి. ఈ హత్య కేసులో నిందితులు ఎవరు సీఎం జగన్ కు తెలుసని, అసలు నేరస్తులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని, డమ్మీ లను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వర్ల రామయ్య ఆరోపించారు. ఏపీ సీఎం జగన్ సొంత బాబాయి హత్యకేసు మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని, కేసును సిబిఐకి ఎందుకు అప్పజెప్పడం లేదంటూ రామయ్య ప్రశ్నించారు. వర్ల చేసిన వ్యాఖ్యలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ అయ్యారు. వివేకా హత్య కేసు పై ఊహాగానాలను ప్రచారం చేస్తే సహించబోమని తేల్చిచెప్పారు.
* ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా వామపక్ష విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో పెవిలియన్ గ్రౌండ్ నుండి బస్ డిపో వరకు సిఎం కేసిఆర్ శవ యాత్ర నిర్వహించారు.అనంతరం శవ యాత్రకు అంత్యక్రియలు చేస్తుండగా ఒక్కసారిగా పోలీసులు వచ్చి అడ్డుకోవడంతో పోలీసులకు విద్యార్థి సంఘాలు,కార్మికుల మధ్య తోపులాట జరిగింది.విద్యార్థి సంఘాలు వెనిక్కి తగ్గకుండా కేసీఆర్ శవ యాత్రకు నిప్పు అట్టించి అంత్యక్రియలు నిర్వహించి డిపోలోకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత నెలకొంది.ఈ తోపులాటలో విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర అస్తస్వస్థకు గురయ్యారు.
* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని పెర్కపల్లి గ్రామం లంబాడీ తండాలో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపిన మజా బాటిల్ ను బానోతు తిరుపతి పిల్లలు త్రాగడంతో మృతి చెందారు. దీనికి కారణం ఇదే గ్రామానికి చెందిన తులసిరాం నాయక్ అనే వ్యక్తే నని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఇందుకు పాత కక్షలే కారణమని చెప్తూ తనకు 24 గంటలలో న్యాయం జరగకపోతే తాను కూడా ప్రభుత్వం పేరు చెప్పి చనిపోతానని తన ఆవేదన వ్యక్తం చేశాడు.
* జమ్మూకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని పాజల్‌పురా ఏరియాలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో అక్కడ పోలీసులు, భద్రతా బలగాలు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది.