Politics

అన్నం పెట్టడం తెదేపా సిద్ధాంతం

Nara Chandrababu Naidu Says Feeding The Poor Is TDPs Primary Goal

అందరికీ ఆహార భద్రత కల్పించాలన్నది తెదేపా ప్రధాన లక్ష్యం.

అప్పటి ఎన్టీఆర్ కిలో రూ.2 బియ్యం పథకం నుండి నిన్నటి అన్న క్యాంటీన్ వరకు అన్న అమృతహస్తం, బాలామృతం, గిరి గోరుముద్దలు, ఆహారబుట్ట, రంజాన్ తోఫా… వంటి తెదేపా పథకాలన్నీ ఈ లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయి

అలాంటిది పేదలను విస్మరించి, కేవలం తెదేపా పథకాలన్న కారణంగా వైసీపీ ప్రభుత్వం ఈ పథకాలన్నింటినీ రద్దు చేసింది.

ఈరోజు ప్రపంచం ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటోంది.

ఇప్పటికైనా ప్రభుత్వం పేదల గురించి ఆలోచించి, అన్న క్యాంటీన్ వంటి పథకాలను పునరుద్ధరించాలి

పేదలకు ఆహారభద్రత కల్పించాలి.

#WorldFoodDay

_ట్విట్టర్ లో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు