Movies

శకుంతల బాలన్

Vidya Balan As Shakuntala-Human Computer

విద్యా బాలన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శకుంతలా దేవి: హ్యూమన్‌ కంప్యూటర్‌’. గణిత మేధావిగా తన ప్రజ్ఞతో ప్రపంచాన్నే అబ్బురపరచిన శకుంతలా దేవి జీవితకథతో ఇది తెరకెక్కుతోంది. ప్రపంచ గణిత దినోత్సవం సందర్భంగా మంగళవారం తన పాత్రకు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను ట్విటర్‌లో విడుదల చేసింది విద్య. అచ్చం శకుంతలా దేవిలాగే పొట్టి జుత్తు, నుదుట బొట్టు, చీరతో కనిపిస్తోంది విద్య. గణిత సంజ్ఞలను వేలిపై ఆడిస్తున్నట్లున్న విద్యా పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. అను మేనన్‌ తెరకెక్కిస్తున్నారు. శకుంతలా దేవి కూతురి పాత్రలో సన్యా మల్హోత్రా నటిస్తోంది. వచ్చే వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.