DailyDose

రవిప్రకాశ్‌పై మరో సరికొత్త మోసం కేసు-నేరవార్తలు-10/17

Another Cheating Fraud Case Lodged On Raviprakash-Telugu Crime News Today-10/17

* టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై మరో కేసు నమోదు. నకిలీ ఐడి కేసులో మరో రవిప్రకాష్ పై మరో కేసు నమోదు. ఐ ల్యాబ్ పేరు తో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఫేక్ ఐడి కార్డు క్రియేట్ చేసిన రవి ప్రకాష్. 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు. చంచల్ గూడ జైలు నుండి పిటి వారెంట్ ద్వారా మియాపూర్ కోర్ట్ కు తీసుకొస్తున్న పోలీసులు.

* ఏలూరు అగ్రికల్చర్ మార్కెట్ యార్డు ను ఆకస్మిక తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. ఏలూరు మార్కెట్ యార్డు లో అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. ఒక రైతు ఇక్కడ లైసెన్స్ పొందాలంటే ప్రభుత్వానికి రూ. 50 వేలు చెల్లించాలి. కానీ, ఇంతకాలం రూ.50 లక్షలు వసూలు చేసి జేబులో వేసుకున్నారు.

* తూర్పుగోదావరి జిల్లాలోని తుని మండలం ఎస్‌. అన్నవరంలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సత్యనారాయణ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. అయితే ఈ దారుణానికి పాల్పడిందెవరన్న విషయం ఇంతవరకూ తెలియరాలేదు. తాజాగా.. హత్య విషయంలో సత్యనారాయణ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తుని వైసిపి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో సహా మరో ఐదుగురి పేర్లను ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కేసులో పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. విలేకరి హత్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిన విషయం విదితమే. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని డీజీపీని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

* తుని సత్యనారాయణ హత్యా కేసు మరువక ముందే గురువారం ఉదయం పది గంటల ప్రాంతాన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండల విశాలాంధ్ర విలేకరి కరుణ వీరుడు పై హత్యా ప్రయత్నం జరిగింది. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్న రాష్ట్రంలో విలేకరులపై పెరుగుతున్న దౌర్జన్యాలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సింది గా కోరుతున్నాం.

* పొట్టిపాడు టోల్ గేట్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు వేర్వేరు దాడులు…280 కిలోలు గంజాయి పట్టివేత… 240 కిలోలు టెంపో బస్సు . ఆర్టీసీ బస్సు లో 40 కిలోల స్వాధీనం.. గన్నవరం పోలీసు స్టేషన్ కి తరలింపు.. ఒక మహిళ సహా 12 మంది అరెస్ట్

* TV5 ఛానల్ పై అక్రమ తొలగింపు కేసులో ఏపీ ఫైబర్ నెట్ కు మరో ఎదురు దెబ్బ. గతంలో విధించిన జరిమానా కొనసాగిస్తూ నేటికి 32 లక్షలు జమ చేయాల్సిందిగా చెప్పిన TDSAT. ఛానల్ పునరుద్ధరించాలన్న తమ ఆదేశాలను వెంటనే అమలు పరచ వలసినదిగా మరోసారి చెప్పిన TDSAT. లేనిపక్షంలో కమిషనర్ నేతృత్వంలో ఓ కమిటీని TDSAT ప్రధాన కార్యాలయానికి పంపి అమలు పరుస్తామని ఆదేశం.

* తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం గ్రామం లో కృష్ణానది కరకట్ట వెంట ఉన్న శైవక్షేత్రం అమీలో అక్రమ నింర్మించిన బాత్ రూమ్స్, క్యాన్టీన్ అక్రమ కట్టడాలను CRDA అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదనరావు ఆధ్వర్యంలో 10 మంది లేబర్స్ తో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన అధికారులు.

* కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కామారెడ్డి జిల్లా ఐక్య విద్యార్థి సంఘాలు కామారెడ్డి జిల్లా ఐక్య విద్యార్థి సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను స్థానిక కామారెడ్డి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ముందు దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించమని వారితో చర్చలకు సిద్ధం కమ్మని రాష్ట్ర హైకోర్టు సూచించినప్పటికీ మొండి వైఖరితో నియంతృత్వ ధోరణిలో కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేది లేదని సీఎం మాట్లాడడం ఆయన యొక్క అవివేకానికి నిదర్శన మని పేర్కొన్నారు.

* సౌదీలో బస్సు ప్రమాదం .. 35 మంది మృతి. సౌదీ అరేబియాలోని ప‌విత్ర న‌గ‌రం మ‌దీనా స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. విదేశీయుల‌తో వెళ్తున్న ఓ బ‌స్సు మ‌రో భారీ వాహ‌నాన్ని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో 35 మంది మ‌ర‌ణించారు. మ‌రో న‌లుగురు గాయ‌ప‌డ్డారు. సౌదీ అరేబియాలోని మ‌క్కా నుంచి మ‌దీనా వెళ్లే హిజ్రా రోడ్డులో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మ‌దీనాకు 170 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న అల్ అక్కాల్ గ్రామం వ‌ద్ద బుధ‌వారం రాత్రి 7 గంట‌ల‌కు ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు అధికారులు చెప్పారు.

*