Movies

మంచు మనోజ్ విడాకులు

Manchu Manoj Posts On Twitter About His Divorce

నటుడు మంచు మనోజ్‌ తన భార్య ప్రణతీ రెడ్డి నుంచి విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియచేశారు. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు సంబంధించిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను నా భార్యతో విడాకులు తీసుకున్నాను. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ముగిసింది. మా ఇద్దరి మధ్య చాలా సందర్భాల్లో మనస్పర్థలు వచ్చిన నేపథ్యంలో మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం. విడిపోతున్నా ఒకరంటే ఒకరికి పూర్తి గౌరవం ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల నేను గతకొంతకాలంగా సినిమాలపై దృష్టి సారించలేకపోయాను. నా కుటుంబంతోపాటు స్నేహితులు, అభిమానులు నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. నాకు అండగా నిలిచిన ప్రతిఒక్కరికి నా కృతజ్ఞతలు. మళ్లీ నేను సినిమాల్లో నటించనున్నాను’ అని మనోజ్‌ తెలిపారు.