రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నిపుణుల కమిటీ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుందని, రాజధాని ఎక్కడ ఉండాలో నిపుణుల కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం రాజధాని ఎక్కడ ఉండాలో మాజీ మంత్రి నారాయణ కమిటీ ద్వారా నిర్ణయించిందన్నారు. ‘‘నేను నారాయణ కాదు.. సత్యనారాయణను. నిపుణుల సూచన.. ప్రజల క్షేమం లక్ష్యంగా నిర్ణయాలుంటాయి. అర్హులైన పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తాం.
ప్రధానమంత్రి అవాస్ యోజన పథకాన్ని లింక్ అప్ చేసి ఇళ్లు నిర్మిస్తాం.
రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది అర్హులను గుర్తించాం. పట్టణాల్లో ఒక సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలంలో ఇళ్ల నిర్మిస్తాం. జి-ప్లస్ తరహా కాకుండా ఇండిపెండెంట్ హౌసెస్‌కు ప్రాధాన్యం ఇస్తాం. టిడ్కో నిర్మించే 300 ఎస్ఎఫ్టీ ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తాం. టిడ్కో పరిధిలోని 50వేల యూనిట్లకు రివర్స్ టెండరింగ్ చేపడుతాం. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిర్మించిన జీప్లస్ ఇళ్లకు మరమ్మతులు చేస్తాం. సబ్‌కమిటీ భేటీ తర్వాత జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై స్పష్టత ఇస్తాం’’ అని బొత్స తెలిపారు.