భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విటర్ పోస్ట్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఆ అమర జవాన్లలో కొందరి పిల్లలు సెహ్వాగ్ అంతర్జాతీయ స్కూల్‌లో క్రికెట్ శిక్షణ పొందుతున్న దృశ్యాలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘నా స్కూల్‌లో ఈ చిన్నారులకు సేవలు అందించడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నా. ఈ చిన్నారులు భారత అమర వీరుల బిడ్డలు. బ్యాట్స్‌మెన్ చేస్తున్న వ్యక్తి అర్పిత్ సింగ్ పుల్వామా అమర జవాన్ రామ్ వకీల్ కుమారుడు, బౌలర్ రాహుల్ సోరెంగ్ పుల్వామా అమర జవాన్ విజయ్ సోరెంగ్ కుమారుడు. ఇంతకన్నా ఆనందాన్నిచ్చే పనులు ఉంటాయా’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ఈ ట్వీట్‌పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపించారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరులకు ఎంతో కొంత తిరిగి ఇవ్వడం మన విధి మీరు గొప్ప వారు సర్ అంటూ కామెంట్లు చేశారు. ఇటీవల మరో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సైతం అమర వీరుల చెందిన 100 మంది చిన్నారుల సంరక్షణ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. వారి చదువులకు అయ్యే ఖర్చును గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ తరపున తానే భరిస్తానని గంభీర్ చెప్పారు.
పుల్వామా అమరవీరుల చిన్నారులు దంచికొడుతున్నారు
Related tags :