సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు జరిమానా విధించారు. బిర్యానీలో తల వెంట్రుకలు వచ్చాయంటూ ఓ వ్యక్తి హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్యారడైజ్ పీఆర్ రాఘవ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆ వ్యక్తి జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జీహెచ్‌ఎంసీకి చెందిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్, శానిటేషన్ అధికారి తనిఖీలు నిర్వహించారు. హోటల్‌లో పరిశుభ్రత పాటించకపోవడాన్ని గుర్తించి రూ.లక్ష జరిమానా విధించి నోటీసు ఇచ్చారు. వారంలో పరిశుభ్రత విషయంలో లోపాలు సరిచేసుకోవాలని.. అలా చేయని పక్షంలో హోటల్‌కు తాళం వేస్తామని అధికారులు హెచ్చరించారు.
సికింద్రబాద్ ప్యారడైజ్ నిర్లక్ష్యం ఖరీదు ₹లక్ష
Related tags :