ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్), వేగేశ్న ఫౌండేషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో భారతదేశంలోని దివ్యాంగుల సహాయార్థం స్థానిక కూచిపూడి రెస్టారెంట్‌లో శుక్రవారం నాడు సంగీత విభావరి నిర్వహించారు. టాంటెక్స్ అధయ్కుడు చినసత్యం వీర్నపు స్వాగతం పలికి సంస్థ కార్యక్రమాలను వివరించారు. వేగేశ్న ఫౌండేషన్ కార్యక్రమాలను ఆ సంస్థ వ్యవస్థాపకులు డా.వంశీ రామరాజు మాట్లాడుతూ 30ఏళ్ల కిందట తమ సంస్థను స్థాపించామని అమెరికాలో 12వ ఘంటసాల, 9వ బాలు సంగీతోత్సవాల పేరిట సెప్టెంబరు 21 నుండి నవంబర్ 10 వరకు ప్రదర్శనలు ఇస్తున్నామని, వీటి ద్వారా సమకూరే నిధులను దివ్యాంగుల చేయూతకు ఖర్చు చేస్తామని వివరించారు. అనంతరం శారద ఆకునూరి, బాలకామేశ్వరరావులు విభావరిని ప్రారంభించారు. “రాముని అవతారం రవికుల సోముని అవతారం…”, “చిటపట చినుకులు పడుతూ వుంటే..”, “ఎవరవయా, ఎవరవయా…”, “వినిపించని రాగలే,కనిపించని అందాలే…”, “చూడుమా చందమామ..” వంటి గేయాలు ఆకట్టుకున్నాయి. స్థానిక ప్రవాసులు చంద్రహాస్ మద్దుకూరి “కన్నులలో పలకరించు వలపులు…” గీతాలాపన అలరించింది. నాగి వడ్లమన్నాటి, శారదలు “మంచు కురిసే వేళలో …”, “లేత చలిగాలిలో హయ్ …” పాటలు శ్రోతలను పరవశింపజేశాయి. ముఖ్య అతిధి డా. వంశీ రామరాజుని, అమెరికా గాన కోకిల శారద ఆకునూరి, అపర ఘంటసాల బాలకామేశ్వరరావులను టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, కార్యదర్శి ఉమామహెష్ పార్నపల్లి, సతీష్ బండారు, ఉపాధ్యక్షులు పాలేటి లక్ష్మి శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ మాజీ అధయ్కుడు యు.నరసింహారెడ్డి, సి.ఆర్.రావు, చంద్రహాస్ మద్దుకూరి, అనంత్ మల్లవరపు, లెనిన్ వేముల, శరత్ యర్రం, కృష్ణా రెడ్డి కోడూరు, లోకెష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
టాంటెక్స్-వేగేశ్న ఫౌండేషన్ సంగీత విభావరి

Related tags :